ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ

ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ
యాక్టర్ గానే కాక ధనుష్ డైరెక్టర్ గా కూడా ఈమధ్య బాగా షైన్ అవుతున్నారు.ఆ ధైర్యంతోనే ఈ ఇడ్లీ కొట్టు అనే మూవీ తను డైరెక్ట్ చేశారు. మూవీ స్టార్టింగ్ లోనే తను చిన్నప్పటి సెలవులకు ఊరెళ్ళినటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అక్కడ జరిగిన కొన్ని సన్నివేశాలను, పాత్రలను సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని చెప్పడం జరిగింది.
ట్రైలర్లో చూపినట్టుగానే సినిమా కథ చాలా సింపుల్ గానే ఉంటుంది తను ఎంతో ఇష్టంగా ప్రాణం పెట్టి చూసుకునే ఇడ్లీ కొట్టు తన తదనంతరం తన కొడుకు చూసుకోవాలి అనే ఒక తండ్రి ఆరాటం, ఇంత చదువుకున్నాం కాబట్టి పట్నం వెళ్లి బతకాలి అనే ఒక కొడుకు కోరిక. ఇదే చిత్రం యొక్క కథాంశం అయితే విదేశాలకు వెళ్లిన ధనుష్ ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి రావాల్సి వస్తుంది తన తండ్రి ఇడ్లీ కొట్టును నడపడానికి తనని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి అనేది చిత్రంలో చూడాల్సిందే
ముందుగా ధనుష్ డైరెక్షన్ గురించి చెప్పాలి ఎక్కడా డివియేట్ అవ్వకుండా అనుకున్న పాయింట్ బాగా తీశారు.
డైలాగ్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసే లాగా చిత్రాన్ని తెరకెక్కించారు దానికి మాత్రం హాట్సాఫ్ చెప్పాలి.
యాక్టర్ గా ధనుష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పే పని లేదు ఇందులో మరోసారి తన ప్రతిభ ఏంటో చూపించుకున్నారు అంతేగాక నిత్యామీనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్ వంటి నటులను సరైన రోల్స్ ఇచ్చి మంచి పర్ఫామెన్స్ రాబట్టారు. తండ్రి పాత్రలో నటించిన రాజ్ కిరణ్ ఒదిగిపోయి మనతో కంటతడి పెట్టిస్తారు.
విలేజ్ విజువల్స్ కానీ అక్కడ వాతావరణం కానీ చాలా బాగా క్యాప్చర్ చేసి స్క్రీన్ పై చూపించారు. మనం సెలవులకు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలతో ఎలా ఉంటామో ఆ వాతావరణం గుర్తుకు తెచ్చేలా ఉంటుంది.
ఈ చిత్రానికి ముఖ్యంగా బ్యాక్ బోన్ నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అని చెప్పొచ్చు. ప్రతి సన్నివేశంలో తన వర్క్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉంటుంది సోల్ ఆఫ్ ద ఫిల్మ్ మ్యూజిక్ అనిపిస్తుంది.
తను చెప్పాలనుకున్న పాయింట్ అంత ఫస్ట్ ఆఫ్ లోనే క్లియర్ అయిపోవడం వల్ల సెకండ్ హాఫ్ లో డ్రామా అంతగా ఉండదు కేవలం తన ఇడ్లీ కొట్టును కాపాడుకోవడం మాత్రమే సింగిల్ అజెండాగా ఉండడం తన మీద దాడులు జరగడం కొంచెం ల్యాగ్ ఫీల్ తెప్పిస్తాయి.
కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు చిత్రంలో వైలెన్స్ ఎక్కువగా ఉండదు, మంచి విజువల్స్ మంచి మ్యూజిక్, సూపర్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి.
మన తల్లిదండ్రులకు మనం దూరంగా బతకడం ఎంత కష్టంగా ఉంటుంది, పుట్టిన ఊరుని వదిలి వెళ్ళడం ఎంతవరకు అవసరం అనే పాయింట్స్ ధనుష్ చాలా నీట్ గా చెప్పారు ఓవరాల్ గా ఇది ఒక సింపుల్ మెసేజ్ ఉన్న సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వీకెండ్ లో సరదాగా చూసేయొచ్చు
The property, complete with 30-seat screening from room, a 100-seat amphitheater and a swimming pond with sandy shower…
The property, complete with 30-seat screening from room, a 100-seat amphitheater and a swimming pond with sandy shower…
The property, complete with 30-seat screening from room, a 100-seat amphitheater and a swimming pond with sandy shower…